విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తురాలు మృతి

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయవాడ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై విషాదం చోటుచేసుకుంది. తాడిగడపకు చెందిన కె. పద్మ (61) అనే భక్తురాలు దుర్గమ్మ దర్శనానికి వచ్చి, మెట్లు ఎక్కుతుండగా అస్వస్థతకు గురై కుప్పకూలారు. లిఫ్టు సిబ్బంది సహకరించకపోవడంతో మెట్ల మార్గంలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందారు. శ్రావణ శుక్రవారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.