ఆదివాసీ సంస్కృతిని కాపాడుకుందామంటూ గర్జించిన ఎమ్మెల్యే బొజ్జు

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుందామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. శుక్రవారం సాయంత్రం జన్నారం మండలంలోని రాయికుంట గ్రామంలో నిర్వహించిన ఆదివాసుల దండారీ సంబరాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి సందర్భంగా ఆదివాసి గూడాలలో దండారి ఆటలు, గుస్సాడి నృత్యాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందనీ అన్నారు. ఆదివాసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే బొజ్జు వివరించారు.