శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన గోండు శంకర్
రిపోర్టర్: వెంకట్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా గార మండలం కండ్రపేట మరియు ఎస్ మత్స్యలేశం గ్రామాల్లో నాలుగు వందల ఎనభై ఐదు కుటుంబాలకు యాభై కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలను పంపిణీ చేసినట్లు గోండు శంకర్ శ్రీకాకుళమా తెలిపారు. వేట నిషేధ భృతి ఇరవై వేలకు పెంపుతో మత్స్యకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. అలాగే ఆర్ట్స్ కాలేజీ వైటీసీ కేంద్రంలో నిర్వహించిన సదస్సులో పాల్గొని విద్యార్థులకు ఉచితంగా దోమతెరలు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.