రాప్తాడు పాఠశాలలో బాలికపై దాడి: హెమంత్ కోసం ముమ్మర గాలింపు
రిపోర్టర్: నరేష్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గోపికపై జరిగిన చేసా హత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికకు బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో వైద్యులు పన్నెండు గంటల పాటు శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడు హేమంత్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని, త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.