హైదరాబాద్‌లో భారత్ వెస్టిండీస్ పోరు: ముత్తూట్ ఫిన్‌కార్ప్ భారీ స్పాన్సర్షిప్
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
భారత్ వెస్టిండీస్ సిరీస్‌లో భాగంగా ఈ నెల పద్నాలుగున హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుందని బీసీసీఐ ప్రతినిధులు వెల్లడించారు. ఈ హోమ్ సీజన్ మొత్తానికి ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ముత్తూట్ ఫిన్‌కార్ప్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు, దేశవాళీ టోర్నమెంట్లన్నింటికీ ఈ ఒప్పందం వర్తిస్తుందని, యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఇది దోహదపడుతుందని బీసీసీఐ అధికారులు స్పష్టం చేశారు.