సచిన్ రికార్డుపై జో రూట్: మాస్టర్ బ్లాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
టెస్టు క్రికెట్ లో తన అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అధిగమించే అవకాశాలపై భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. ఒక కార్యక్రమంలో అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, జో రూట్ తొలి మ్యాచ్ ఆడినప్పుడే అతడిలో గొప్ప ఆటగాడయ్యే లక్షణాలను గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం రూట్ తన రికార్డుకు చేరువలో ఉన్నాడని సచిన్ పేర్కొన్నారు.