రాజోలు మండలం చింతలపల్లిలో వర్షంతో జలమయమైన ప్రధాన రహదారి
రిపోర్టర్: K NAGA SRINU
స్థలం: రాజోలు
రాజోలు మండలం వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మండలంలోని చింతలపల్లి ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు చేరి రహదారి పూర్తిగా జలమయంగా మారింది. రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.