స్థానిక ఎన్నికల్లో కూటమి హవా: ఇబ్రహీంపట్నంలో క్లీన్ స్వీప్ చేసిన కూటమి
రిపోర్టర్: సునీల్
స్థలం: ఇబ్రహీంపట్నం
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని పదకొండు ఎంపీటీసి స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దాములూరు, కాచవరం, కేతనకొండతో పాటు వివిధ స్థానాల్లో టీడీపీ, జనసేన జెండా పాగా వేశాయని, పలుచోట్ల వైసీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైందని స్థానిక నాయకులు పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లోనూ కూటమి విజయదుందుభి మోగించిందని విశ్లేషకులు వెల్లడించారు.