దూర ప్రాంత విద్యార్థుల చదువు కోసం ఉచిత సైకిళ్ల పంపిణీ
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
జల్లి జడ్పీ హైస్కూల్లో నాల్గవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న నలభై మంది విద్యార్థులకు రెండు లక్షల ఇరవై వేల రూపాయల విలువైన ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. రిటైర్డ్ గణిత ఉపాధ్యాయుడు జగన్మోహన్ చొరవతో టెల్సా సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. దూర ప్రాంతాల నుంచి రోజూ కాలినడకన బడికి వస్తున్న విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి దాతలు ఈ సాయం అందించారు. అడిషనల్ కలెక్టర్ వై.వి.గణేష్, డీఈవో రంగయ్య నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు సైకిళ్లను సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు చదవాలని పిలుపునిచ్చారు. ఈ ఉచిత సైకిళ్ల పంపిణీ ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రవాణా కష్టాలు తీరడంతో పాటు బడి మానేసే వారి సంఖ్య తగ్గుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.