కారు వెనుక బూతు స్క్రీన్.. బెంగళూరులో సంచలనం!
రిపోర్టర్: సురేష్
స్థలం: General
బెంగళూరు ట్రాఫిక్ జామ్‌లో ఒక రెనాల్ట్ క్విడ్ కారు వెనుక భాగంలో ఎల్ఈడీ స్క్రీన్‌పై అసభ్యకరమైన, బూతు మాటలను ప్రదర్శించడం కలకలం రేపింది. రద్దీగా ఉండే రోడ్డుపై వెళ్తూ చిన్నారులు, పాదచారులు, ఇతర వాహనదారులు చూసేలా ఈ అశ్లీల సందేశాన్ని ఉంచడంపై ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కారు నెంబర్ ప్లేట్‌తో సహా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేయడంతో ఈ వ్యవహారం వైరల్ అయింది.