రాహుల్ గాంధీ, ప్రియాంకలపై పోలీసుల కేసులు: దిల్లీలో తీవ్ర కలకలం

రిపోర్టర్: మహేష్ స్థలం: దిల్లీ

దిల్లీలో ఇటీవల జరిగిన విపక్షాల ఆందోళన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించడం, అధికారులపై దాడికి పాల్పడటం వంటి తీవ్ర ఆరోపణలతో ఈ కేసులు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.