జన్నారం ప్రభుత్వ పాఠశాలల నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపిక

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. మండలంలోని కామన్ పల్లి పాఠశాల నుండి బానోత్ ప్రకాష్, కిష్టాపూర్ పాఠశాల నుండి కొత్త రాజన్న, అక్కపెళ్లిగూడ పాఠశాల నుండి అంకం కరుణ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు దక్కించుకున్నారని స్థానిక అధికారులు తెలిపారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా వారు ఈ అవార్డులను ఘనంగా అందుకున్నారు.