కేటీఆర్ బినామీ సంతోష్ రావు ఆస్తులపై కాంగ్రెస్ నేత రమ్యరావు సంచలన ఆరోపణలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాలనలో రాష్ట్ర సంపదను దోచుకుందని కాంగ్రెస్ నాయకురాలు రమ్యరావు హైదరాబాద్ గాంధీ భవన్‍లో ఆరోపించారు. కేటీఆర్ బినామీగా మారిన జోగినపల్లి సంతోశ్ రావ్ అడ్డగోలుగా వేల కోట్ల ఆస్తులు సంపాదించారని, కరీంనగర్‍లో చెప్పులు లేని వ్యక్తికి కొండాపూర్, బంజారాహిల్స్ లో కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సొంత అన్న కూతురైన తనను, కవితను ఇంటి నుంచి బయటకు పంపి సంతోశ్ రావును ఎందుకు పక్కన పెట్టుకున్నావని కేటీఆర్‍ను నిలదీశారు.