శ్వాస ఇబ్బందులతో బాధపడుతున్న విద్యార్థులను ఆసుపత్రికి తరలించిన ఎస్ఐ సురేష్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలంలోని ఏకలవ్య పాఠశాలలో కొందరు విద్యార్థులకు ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. సమాచారం అందుకున్న జీకే వీధి ఎస్ఐ సురేష్ తక్షణమే స్పందించి పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, మెరుగైన వైద్యం కోసం వారిని చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.