కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి తీరుపై మల్లికార్జున ఖర్గే నిప్పులు

రిపోర్టర్: సతీష్ స్థలం: న్యూఢిల్లీ

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎన్నికల సంఘం వివాదాస్పద నిర్ణయాలు, నిష్పక్షపాత పనితీరుపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు హాజరవుతున్నారు.