పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్న పీలా గోవింద సత్యనారాయణ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: అనకాపల్లి
పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన లీడర్ విత్ క్యాడర్ సమావేశంలో 34 మంది లబ్ధిదారులకు రూ.20.30 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు.