పంట నష్టాలపై తక్షణ సర్వే చేపట్టాలని అచ్చెన్నాయుడు ఆదేశం

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటల వివరాలను వెంటనే సేకరించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయి సర్వేపై సమీక్ష జరిపారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, పొలాల్లో నిలిచిన నీటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో వ్యవహరించి రైతులకు సకాలంలో సహాయం అందించాలని మంత్రి పిలుపునిచ్చారు.