ప్రభుత్వ ఆస్పత్రులలో తల్లుల కోసం ఎన్టీఆర్ బేబీ కిట్లు

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే తల్లుల కోసం ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకాన్ని పునఃప్రవేశపెట్టింది. నవజాత శిశువుల సంరక్షణ కోసం వైద్య, ఆరోగ్య శాఖ ఈ కిట్లను అందించనుంది. ఇందుకు సంబంధించి జీవో నంబర్ 61 ద్వారా ఏడాదికి రూ.51.15 కోట్ల నిధులను కేటాయించారు. ఒక్కో కిట్కు రూ.1,410 ఖర్చు చేస్తూ 19 రకాల వస్తువులతో కూడిన కిట్లను తల్లులకు అందజేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.