నంచర్లలో చైతన్య కళాశాల భవనం లీజు వివాదంపై ఉద్రిక్తత

రిపోర్టర్: గోపి స్థలం: Mahamadabad

మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో చైతన్య కోఆపరేటివ్ జూనియర్ కళాశాల భవనం మరియు ఖాళీ స్థలం లీజు వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ ఆస్తిని వ్యక్తిగత పేరుతో లీజుకు ఇవ్వడం ద్వారా భూమి అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని కొందరు ఆరోపించగా, విద్యుత్ కనెక్షన్ అనుమతుల కోసం మాత్రమే పత్రాల ప్రక్రియ చేపట్టామని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కే.ఎం. నారాయణ స్పష్టం చేశారు. ఈ అంశంపై అధికారులు సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.