వెంకటాచలంలో మద్యం మత్తులో దాడి: నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు

రిపోర్టర్: రాజేష్ స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో మద్యం మత్తులో కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. ఇడిమేపల్లి గ్రామానికి చెందిన అంకయ్యపై నలుగురు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారని పోలీసులు తెలిపారు. వినాయక చవితి నిమజ్జనం సమయంలో తలెత్తిన పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులు శేషు, అన్వేశ్, సంపత్, రవిలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు స్థానిక పోలీసులు స్పష్టం చేశారు.