రాష్ట్రంలో ఎల్నినో ముప్పు: ఈ నెల 28న అఖిలపక్ష భేటీ

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో తలెత్తుతున్న ఎల్నినో ప్రభావం మరియు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ నెల 28వ తేదీన హైదరాబాద్లోని సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షత వహించనున్న ఈ భేటీలో రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన నివారణ చర్యలపై చర్చిస్తామని అధికారులు స్పష్టం చేశారు.