ప్రభాస్ ఫౌజీ మరియు జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలపై యాక్షన్ డైరెక్టర్ ఛేతన్ కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ టాలీవుడ్ హీరోలు ప్రభాస్ నటించనున్న ఫౌజీ అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ చిత్రాలకు సంబంధించి యాక్షన్ డైరెక్టర్ ఛేతన్ డిసౌజా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రజనీకాంత్ జైలర్ చిత్రానికి ప్రశంసలు అందుకున్న ఆయన ఈ రెండు సినిమాల్ లో పోరాట ఘట్టాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో సహజసిద్ధమైన యాక్షన్ సీన్లు ఉంటాయని, ప్రభాస్ చిత్రంలో స్టైలిష్ పోరాటాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని ఛేతన్ డిసౌజా పేర్కొన్నారు.