రికార్డు స్థాయిలో రెండు లక్షలకు పైగా పలికిన గణపతి లడ్డూ
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ పట్టణంలోని శివాజీనగర్‌లో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంలో బాల గంగాధర్ తిలక్ యూత్ అసోసియేషన్ సభ్యులు రెండు లక్షల ఒక వేల నూట పదహారు రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. ఛత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విజేతలకు పురపాలక చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్ లడ్డూను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు పాల్గొన్నారు.