ప్రభుత్వ కార్యాలయాల్లో కరవైన వసతులు: తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Vizianagaram

వివిధ సేవల కోసం నిత్యం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలకు కనీస వసతులు కరవయ్యాయని, కూర్చోవడానికి బెంచీలు లేక చెట్ల కింద వేచి చూడాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోయారు. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక మహిళలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, పలు చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరి ప్రాణాపాయకరంగా మారాయని, తక్షణమే అధికారులు స్పందించి వసతులు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.