టొరంటో ఫిల్మ్ఫెస్టివల్లో కీర్తి సురేష్ ‘డోరతి’ మూవీ ప్రదర్శన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: World
ప్రముఖ నటి కీర్తి సురేష్ నటించిన తమిళ చిత్రం డోరతి టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026లో ఘనంగా ప్రదర్శితమైంది. ప్రీమియర్ ప్రదర్శన అనంతరం ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభించడంతో పాటు స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. ఈ చలనచిత్రోత్సవం కోసం ప్రత్యేకంగా ముస్తాబైన తన క్యూట్ ఫోటోలను కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.