ప్రాజెక్టు వర్క్ చేయలేదని పదో తరగతి బాలుడిపై ఉపాధ్యాయుడి దాడి

రిపోర్టర్: మహేష్ స్థలం: నెల్లూరు

జలదంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాజెక్టు వర్క్ చేయలేదనే కోపంతో పదో తరగతి విద్యార్థి చైతన్యను ఆంగ్ల ఉపాధ్యాయుడు ఏసుదాసు కర్రతో విచక్షణారహితంగా చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన బాలుడిని తల్లిదండ్రులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. బాధిత బాలుడి కుటుంబసభ్యులు ఉపాధ్యాయుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.