అత్యవసర సమయంలో 112కు కాల్ చేయాలని స్పష్టం చేసిన ఏలూరు పోలీసులు

రిపోర్టర్: సురేష్ స్థలం: ఏలూరు

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే 112 నంబర్కు ఫోన్ చేసి సహాయం పొందాలని ఏలూరు పోలీసులు సూచించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఏ క్షణంలోనైనా తక్షణ సేవలు అందించేందుకు పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వారు వెల్లడించారు. ప్రజల రక్షణే ధ్యేయంగా నిరంతరం అప్రమత్తంగా సేవలందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు జిల్లా పోలీస్ శాఖ (@SpEluruDistrict) అధికారికంగా విజ్ఞప్తి చేసింది.