సచివాలయ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి స్పష్టీకరణ
రిపోర్టర్: గోపి
స్థలం: NTR District
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి డీఎస్ బీవీ స్వామి స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సచివాలయ సిబ్బంది రెగ్యులరైజేషన్, సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడట్లేదని చెప్పారు. ఉద్యోగుల డిమాండ్ మేరకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైల్ ను ఆర్థికశాఖకు పంపించామని, ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు.