రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన ప్రసూతి వార్డును ప్రారంభించిన ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయనగరం
రాజాం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రసూతి వార్డును ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. ఆసుపత్రిలో ప్రసూతి సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఈ వార్డు ఎంతగానో ఉపయోగపడనుందని ఎమ్మెల్యే తెలిపారు.