ఏఐ ట్రెండ్‌తో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర రాజకీయ వార్
రిపోర్టర్: కిరణ్
స్థలం: భారతదేశం
సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న 80s ఏఐ ఇమేజ్ ట్రెండ్ రాజకీయ పార్టీల మధ్య తీవ్ర యుద్ధానికి దారితీసింది. కేరళ కాంగ్రెస్ గుజరాత్ వీధులపై సెటైరికల్ ఏఐ చిత్రం పోస్ట్ చేయగా, తెలంగాణ బీజేపీ సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని ప్రతీకార పోస్ట్‌తో కౌంటర్ ఇచ్చింది. ఇరు పార్టీల వ్యక్తిగత విమర్శలు, ట్రోలింగ్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.