అమానిగుడిపాడులో వైభవంగా పోలేరమ్మ బోనాలు

రిపోర్టర్: మహేష్ స్థలం: మార్కాపురం

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడులో పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ గ్రామస్థులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి వాహనమైన బొల్లావును గ్రామ వీధుల్లో ఉత్సాహంగా ఊరేగించి మొక్కులు చెల్లించుకున్నారు.