దువ్వాడలో విషాదం.. ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమల నగర్ రోడ్ నంబర్-4లో బొబ్బిలి ఆశ (20) ఆత్మహత్యకు పాల్పడింది. పొట్టిదొరపాలెంకు చెందిన ఆశకు 2023లో రామసాయి గణేశ్తో వివాహం జరిగింది. శుక్రవారం సాయంత్రం భర్త విధులకు వెళ్లగా, రాత్రి 6.30 గంటలకు చివరిసారిగా ఫోన్లో మాట్లాడారు.

శనివారం తెల్లవారుజామున విధులకు ముగించుకుని ఇంటికి వచ్చిన భర్తకు, ఆశ ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్ఐ నేతాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.