తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: నెల్లూరు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మురసు తీవ్ర తుపాను నెల్లూరు, చెన్నై తీరాల మధ్య కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. ఈ తుపాను ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు జిల్లాలకు ముప్ పై ఏడు కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. సహాయక చర్యల కోసం పద్నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించినట్లు పదో బెటాలియన్ కమాండెంట్ వివిఎన్ ప్రసన్న కుమార్ వెల్లడించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలిస్తున్నారు.