అంతర్జాతీయ అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డుకు డాక్టర్ శ్రీదేవి ఎంపిక

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రదానం చేయనున్న I2OR గ్లోబల్ ఎడ్యు కాన్క్లేవ్ అవార్డ్స్-2026కు మోత్కూరుకు చెందిన డాక్టర్ శ్రీదేవి సంద ఎంపికయ్యారు. హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీలో ఆమె అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.

విద్యా, పరిశోధన రంగాల్లో ఆమె చేస్తున్న కృషిని గుర్తించి ఈ అంతర్జాతీయ అవార్డును ప్రకటించినట్లు శ్రీదేవి తెలిపారు. ఐఐఓఆర్ (I2OR) ఆధ్వర్యంలో ఈ అవార్డులను అందజేయనున్నారు. ఈ ఘనత సాధించిన శ్రీదేవిని పలువురు అభినందించారు.