రాష్ట్రంలో ఘనంగా శరన్నవరాత్రులు: ప్రజలకు చంద్రబాబు, లోకేశ్ దసరా శుభాకాంక్షలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయవాడ

రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేశ్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని వారు కోరుకున్నారు. ఇంద్రకీలాద్రిపై భక్తులకు కనకదుర్గమ్మ తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు.