పొదలకూరులో ఫ్యాన్ గుర్తుకే ఓటెయ్యాలంటూ కాకాణి పూజిత విస్తృత ప్రచారం
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి బచ్చలపల్లి సురేష్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి కీలుకుప్ప కృష్ణవేణిని గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ తిరిగారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. జగనన్న పాలనలో మహిళల సంక్షేమం, గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేశామని ఆమె గుర్తు చేశారు.