విజయనగరం స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా వలయం సిద్ధం చేయనున్న అధికారులు
రిపోర్టర్: సత్యా
స్థలం: విజయనగరం
విజయనగరం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్స్ మరియు కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఎఆర్ దామోదర్ శనివారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేస్తూ అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిరోధించేందుకు బ్యారికేడ్లు, కట్టుదిట్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్పష్టంగా ఆదేశించారు.