తుపాను బాధితులకు వాట్సప్ సేవలు: అధికారుల కీలక ప్రకటన
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మనమిత్ర వాట్సప్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అధికారులు తెలిపారు. తుపాను సమయంలో ప్రజలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే 9552300009 నంబర్ ద్వారా సమాచారం అందించి అత్యవసర సాయం పొందాలని అధికారులు కోరారు. ఈ సదుపాయాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు స్పష్టం చేశారు.