తెలంగాణలో భారీ వర్షాలు: రైతన్నలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్!
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో 18 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదై పంటలు ఎండిపోతున్నాయి. ఈ తరుణంలో సెప్టెంబర్ 11, 12 తర్వాత రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు లేక ఆందోళనలో ఉన్న అన్నదాతలకు ఈ అంచనా కొంత ఊరటనిస్తోంది.