రాజకీయ ముసుగులో నేరాలను సహించొద్దు: పోలీసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర హెచ్చరిక
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించవద్దని, రౌడీల తాట తీయాలని పోలీసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీసు శాఖను దేశానికే ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.