రిమ్స్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన జాన్సన్
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి అగ్నిప్రమాదంలో మృతి చెందిన గిన్నెరగూడ గ్రామానికి చెందిన 15 రోజుల చిన్నారి కుటుంబాన్ని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ పరామర్శించారు. బాధిత దంపతులు దినేష్, షేకుబాయిలకు ఆర్థిక సాయం అందించి, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషాద సమయంలో పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చిన్నారి మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.