హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

వినాయక చవితి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక జనసాధారణ్ రైళ్లను ప్రకటించింది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఈ అన్‌రిజర్వ్‌డ్ స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.