బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏపీకి భారీ వర్షాల ముప్పు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Andhra Pradesh

పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో కదులుతున్న ఈ తీవ్ర వాయుగుండం కళింగపట్నానికి 100 కి.మీ, విశాఖకు 180 కి.మీ దూరంలో ఉంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.