టాలీవుడ్లో సంచలనం: జై హనుమాన్ చిత్రంలో మమిత బైజు కీలక పాత్ర
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్న మమిత బైజు మరో భారీ ప్రాజెక్టులో భాగమైనట్లు సినీ వర్గాల సమాచారం. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం జై హనుమాన్ లో ఈ నటి కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రిషబ్ శెట్టి, రానా దగ్గుబాటి నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.