భారత క్రికెటర్ పృథ్వీ షాకు ప్రేయసితో బ్రేకప్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: India

భారత యువ క్రికెటర్ పృథ్వీ షాకు వ్యక్తిగత జీవితంలో మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది మే నెలలో సినిమా నటి ఆకృతి అగర్వాల్‌తో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న పృథ్వీ షా.. తాజాగా ఆమెతో తెగతెంపులు చేసుకున్నాడు. భవిష్యత్ పట్ల ఇద్దరి లక్ష్యాలు వేర్వేరుగా ఉన్నాయని, పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆకృతి అధికారికంగా ప్రకటించడంతో ఈ బ్రేకప్ వార్తలు నిజమయ్యాయి.