భంగ్య నాయక్ తండాలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మొర్రిగుడం గ్రామ పంచాయతీ పరిధిలోని భంగ్య నాయక్ తండాలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
స్థానిక గ్రామ పెద్దలు ఈ వేడుకలపై తమ హర్షం వ్యక్తం చేస్తూ, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు. పండుగ సందర్భంగా తండాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.