రైతులకు అలర్ట్.. డిజిటల్ పంట సర్వేతో బోనస్!

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆత్మకూరు(ఎం)

మండలంలోని 17 రెవెన్యూ గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ పంట సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. అశోక్ కుమార్ కోరారు. సన్న రకాల వరి సాగు చేసే రైతులు వివరాలు నమోదు చేయిస్తేనే క్వింటాలుకు రూ. 500 బోనస్ వర్తిస్తుందని తెలిపారు.

సెప్టెంబర్ 30, 2026 చివరి తేదీలోపు ప్రతి రైతు తమ పొలాల వివరాలను నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. పంట వివరాల నమోదులో ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక రైతు వేదికను సంప్రదించాలని రైతులకు స్పష్టం చేశారు.