సెమీకండక్టర్ టెక్నాలజీలో ప్రత్యేక శిక్షణ: ఐఐటీ గువాహటి, టాటా ఎలక్ట్రానిక్స్ కీలక ఒప్పందం

రిపోర్టర్: రాము స్థలం: Guwahati

దేశంలో సెమీకండక్టర్ రంగంలో నిపుణులైన విద్యార్థులను తయారు చేసేందుకు ఐఐటీ గువాహటి సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ తో కలిసి కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు విద్యావర్గాలు వెల్లడించాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఐఐటీ గువాహటి క్యాంపస్ లో అత్యాధునిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ రంగాల్ లో విద్యార్థులకు ప్రత్యేక ప్రయోగాత్మక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.