టీచర్లపై దాడులు చేయడం అరాచకమంటూ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం
రిపోర్టర్: నరేష్
స్థలం: విజయవాడ
విజయవాడలో జరిగిన మెగా డీఎస్సీ నిరసనల ఉద్రిక్తతలపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే రౌడీషీటర్లు, బ్లేడ్‌బ్యాచ్ సభ్యులను శాప్ కార్యాలయానికి తరలించి ఉపాధ్యాయులపై దాడులకు తెగబడ్డారని ఆమె ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని, నిరుద్యోగుల శ్రమను వైసీపీ బలిచేస్తోందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.