హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: కారు బోల్తా పడి దంపతులు మృతి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి మండలం కంది గ్రామ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు అక్కడిక్కడే దుర్మరణం చెందారని పోలీసులు తెలిపారు. శంకర్పల్లి మండలం గజులగూడెం గ్రామానికి చెందిన యెల్లకొండ నరసింహులు, అతని భార్య మౌనిక కారులో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.